జొన్న పాల తాలికలు
కావలసిన పదార్థాలు
జొన్నపిండి 100గ్రా
యాలకుల పొడి . 7గ్రా
పాలు 150మి . లీ
బెల్లం 150గ్రా
ఉప్పు చిటికెడు
నీళ్ళు 125 మి . లీ
తయారీ విధానము
* గిన్నెలో 125 మి . లీ . పోసి , పొయ్యి మీద పెట్టి బాగా మరగనివా మరుగుతున్న నీళ్ళలో పిండిని కలుపుకొని 10 ని | | లు ఉడకనివ్వాలి
• విడిగా బెల్లాన్ని తీగ పాకం రానిచ్చి అందులో యాలకుల పొడి వేసి ఉండాలి
* పాలను మరగనిచ్చి దానిలో ముందుగా తయారు చేసుకొన్న తాలికలు వేసికొని మరగనివ్వాలి
. • వీటికి ముందుగా తయారు చేసుకొన్న బెల్లం పాకం వేసి బాగా కలియబె
పోషక విలువలు
100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 4 . 46 గ్రా . , కొవ్వు 2 . 93 పీచుపదార్ధము 0 . 7 గ్రా . , పిండి పదార్థము 55 . 4 గ్రా . , శక్తి 273 . 9 కి . కాల కాల్షియం 95 . 25 మి . గ్రా . మరియు ఇనుము 2 . 1 మి . గ్రా .
జొన్న రవ్వ బిర్యాని
కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ 100 గ్రా .
ఉల్లిపాయలు 16 గ్రా .
పచ్చిమిర్చి 5 గ్రా
పుదీనా 5 గ్రా .
కొత్తిమీర 5 గ్రా .
నెయ్యి లేదా నూనె 5 గ్రా .
జీడిపప్పు ( అవసరమైతే)
పలావు దినుసులు 10 గ్రా .
ఉప్పు రుచికి సరిపడా
బంగాళాదుంపలు
1 లేదా 20 గ్రా .
క్యా రెట్ 15 గ్రా .
అల్లం 10 గ్రా .
వెల్లుల్లి 5గ్రా .
తయారీ విధానము
* ముందుగా ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , బంగాళాదుంపలు , క్యారెట్ , కొత్తిమీర , పుదీనాలను ముక్కలుగా తురుముకోవాలి .
* మందపాటి గిన్నెలో నూనె పోనీ పలావు దినుసులు , అల్లం , వెల్లుల్లి ముద్ద , ఉల్లిపాయలు , పచ్చిమిర్చి ముక్కలు వేసి 5 ని ॥ లు వేయించాలి .
వేగిన తరువాత తరిగిన కూరగాయల ముక్కలు వేసి మరో 5 ని ॥ లు వేగనిచ్చి రుచికి తగినంత ఉప్పువేసి 4 కప్పుల నీళ్ళుపోసి మరగనివ్వాలి .
మరుగుతున్న నీళ్ళలో రవ్వను వేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి .
• తయారైన బిర్యానీని పుదీనా , కొత్తిమీరలతో అలంకరించుకోవాలి . పోషక విలువలు 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 6 . 4 గ్రా . , కొవ్వు 9 . 02 గ్రా . , పీచు | పదార్థము 1 . 4 గ్రా . , పిండి పదార్థము 43 . 66 గ్రా . , శక్తి 66 . 02 కి . కాలరీస్ , కాల్షియం 36 . 42 మి . గ్రా . మరియు ఇనుము 3 . 6 మి . గ్రా .
