జొన్న రవ్వ ఉప్మా
కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ - 100 గ్రా . ,
కరివేపాకు - 3 గ్రా .
నూనె - 50 మి . లీ .
వేరుశనగ గుళ్ళు - 30 గ్రా .
ఉల్లిపాయలు - 30 గ్రా .
టమోటాలు - 20 గ్రా .
పచ్చిమిర్చి - 10గ్రా .
జీలకర్ర - 3 గ్రా .
క్యారెట్లు - 20 గ్రా .
ఆవాలు - 2 గ్రా .
నీరు - 3 1 / 2
ఉప్పు - తగినంత
ప్పులు పచ్చిశనగపప్పు - 5 గ్రా . తయారీ విధానము * బాణిలో 2 టీస్పూన్ల నూనె వేసి జొన్న రవ్వని రంగు మారేంతవరకు వేయించాలి .
ఒక పాత్రలో 15 మి . లీ . నూనె వేసి దానిలో జీలకర్ర , ఆవాలు , తరిగిన ఉల్లిపాయలు , టమాటా , క్యారెట్ మరియు పచ్చిమిర్చి , కరివేపాకు వేసి వేయించాలి .
ఇప్పుడు ఉప్పు , మూడున్నర కప్పుల నీరు పోసి 10 నిమిషాలు మరిగించాలి .
మరిగిన నీటిలో జొన్న రవ్వని వేసి ఉడికించాలి .
ఉడికించిన తర్వాత వేడివేడిగా వడ్డించాలి .
పోషక విలువలు
. 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 7 . 44 గ్రా . , కొవ్వు 20 . 28 గ్రా . , శక్తి 379 . 78 కి . కాలరీస్ , కాల్సియం 52 . 57 మి . గ్రా . , భాస్వరం 180 . 31 మి . గ్రా . , మరియు ఇనుము 2 . 20 మి . గ్రా .
